పవన్ పవర్ ఎపిసోడ్ పార్ట్ 2 ప్రోమో కి డేట్ ఫిక్స్.!

Published on Feb 4, 2023 12:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మొదటిసారిగా ఓటిటి లో ఓ షో లో పాల్గొని దానిలో కూడా రికార్డులు బద్దలు కొడుతున్నారు. మరి ఆ షో నే నందమూరి నటసింహ బాలకృష్ణ హోస్ట్ గా ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు ప్లాన్ చేసిన సూపర్ హిట్ టాక్ షో “అన్ స్టాప్పబుల్ 2”. మరి ఇందులో పవర్ ఫినాలే గా వచ్చిన ఈ సూపర్ హిట్ ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్లాన్ చేయగా మొన్ననే వచ్చిన పార్ట్ 1 ఎపిసోడ్ రికార్డులు బ్రేక్ చేసింది.

ఇక ఇప్పుడు ఆహా వారు అయితే మరో సూపర్ అప్డేట్ ని ఈ ఎపిసోడ్ పార్ట్ 2 పై అందించారు. పార్ట్ 1 ఎపిసోడ్ తో రికార్డులు పగిలే జాతర జరిగింది పార్ట్ 2 తో కూడా అంతకు మించే ఉంటుంది అని ఈ ప్రోమో ని ఈ ఫిబ్రవరి 5 న రిలీజ్ చేస్తున్నట్టుగా డేట్ ఫిక్స్ చేశారు. అంటే రేపే ఈ అవైటెడ్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేస్తుంది అని చెప్పాలి. మరి రేపు వచ్చే ఈ ప్రోమోలో ఎలాంటి అంశాలు ఉంటాయో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :