టాక్..”పుష్ప” గ్రాండ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్ అయ్యిందా.?

Published on Nov 25, 2021 8:00 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ సినిమా “పుష్ప”. భారీ అంచనాలతో శరవేగంగా కంప్లీట్ అవుతున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. బన్నీ కూడా ఈ మధ్యనే హన డబ్బింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేసేసిన సంగతి తెలిసిందే.

మరి అలా అంతకంతకు హైప్ పెరుగుతూ వెళ్తున్న ఈ చిత్రంపై ఇంకో ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది. ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుకకి డేట్ ఫిక్స్ అయ్యిందట. లేటెస్ట్ టాక్ ప్రకారం అయితే వచ్చే డిసెంబర్ 12న ఈ సినిమా ఈవెంట్ హైదరాబాద్ లో జరగనున్నట్టు తెలుస్తుంది.

మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ రెండు భాగాలుగా నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇదే వచ్చే డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :