రామ్ సాలిడ్ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ కి డేట్ ఫిక్స్.!

Published on Jan 15, 2022 12:00 pm IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ కూడా ఒకడు. మరి బాక్సాఫీస్ దగ్గర “ఇస్మార్ట్ శంకర్”, “రెడ్” సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రామ్ నెక్స్ట్ ప్రముఖ దర్శకుడు ఎన్ లింగుసామి తో ఒక సాలిడ్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరీర్ లో 19వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం గత కొన్నాళ్ల నుంచి చిత్రీకరణ జరుపుకుంటుంది.

మరి ఈ సంక్రాంతి కానుకగా మేకర్స్ ఇప్పుడు సాలిడ్ అప్డేట్ ని రివీల్ చేశారు. ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ ని మరియు టైటిల్ ని ఈ జనవరి 17 మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇది రామ్ ఫ్యాన్స్ కి ఈ పండుగ రోజు మంచి ట్రీట్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :