టాక్..”RRR” మూడో సాంగ్ కి డేట్ ఫిక్స్ అయ్యిందా.??

Published on Nov 19, 2021 7:25 am IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మరి ఈ గ్యాప్ లో చిత్ర యూనిట్ మంచి అప్డేట్స్ కూడా ఇస్తూ వస్తున్నారు.

అలా రీసెంట్ గా రెండో సాంగ్ ని రిలీజ్ చెయ్యగా దానికి భారీ రెస్పాన్స్ ఇంకా కొనసాగుతూ ఉంది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు సినిమా నుండి మూడో సాంగ్ కి డేట్ ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తోంది. ఈ సాంగ్ ని మేకర్స్ వచ్చే నవంబర్ 24 న రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ భారీ సినిమాకి కీరవాణి అద్భుతమైన సంగీతం అందిస్తుండగా డీవీవీ దానయ్య నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :