సుధీర్ బాబు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ కి డేట్ ఫిక్స్.!

సుధీర్ బాబు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ కి డేట్ ఫిక్స్.!

Published on Dec 31, 2021 12:30 PM IST

మన టాలీవుడ్ మోస్ట్ డెడికేటివ్ హీరోల్లో హీరో సుధీర్ బాబు కూడా ఒకరు. మంచి లైనప్ తో ఇప్పుడు కెరీర్ ని ఆసక్తిగా మార్చుకున్న సుధీర్ బాబు ఆ సినిమాలతో ఒక నటుడుగా కూడా మంచి పరిణితి చెందుతూ వస్తున్నాడు. అయితే తన కెరీర్ లో బ్యూటిఫుల్ సినిమాలు ఇచ్చిన దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తో చేస్తున్న మరో ఆసక్తికర ప్రాజెక్ట్ “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”.

యంగ్ అండ్ టాలెంటడ్ హీరోయిన్ కృతి శెట్టి నటిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రేపు జనవరి 1 కొత్త సంవత్సరం కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈ అప్డేట్ తో కృతి ప్రీ లుక్ లాంటిది కూడా రివీల్ చేశారు. ఇక రేపు వచ్చే ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ చిత్రాన్ని బెంచ్ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు