వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కి సిద్దమైన “83” మూవీ..!

Published on Feb 16, 2022 1:32 am IST

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ హీరోగా, కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా ’83’. గత ఏడాది డిసెంబర్ 24 ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదలైన ఈ చిత్రం పర్వాలేదనిపించుకుంది. అయితే ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కి సిద్దమయ్యింది.

ఈ చిత్రం హిందీ వెర్షన్ మొదటిసారిగా మార్చి 20, 2022న రాత్రి 8 గంటలకు స్టార్ గోల్డ్‌లో ప్రదర్శించబడుతుందని మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. దీపికా పదుకొనే, జీవా, చిరాగ్ పాటిల్, పంకజ్ త్రిపాఠి, సాకిబ్ సలీమ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయిన వారు మార్చ్ 20న ఎంచక్కా టీవీల్లో చూసేయొచ్చు.

సంబంధిత సమాచారం :