‘అజ్ఞాతవాసి’ టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు !

పవర్ స్టార్ అభిమానులోను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ‘అజ్ఞాతవాసి’ టీజర్ రిలీజ్ డేట్ ఖాయమైపోయింది. ఈ డిసెంబర్ నెల 16వ తేదీన చిత్ర టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. దాంతో పాటే కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. దీంతో అభిమానుల్లో కోలాహలం ఎక్కువైపోయింది.

ఇన్ని రోజులు అప్డేట్స్ పై కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసేలా చేసిన టీమ్ ఈ ఒక్కరోజే ఉదయం సెకండ్ సింగిల్ ‘గాలి వాలుగా’ను రిలీజ్ చేసిన, ఇప్పుడు టీజర్ విడుదల తేదీని ప్రకటించి, ఇంకొద్దిసేపట్లో సంగీత దర్శకుడు అనిరుద్ రూపొందించిన స్పెషల్ సాంగ్ ను రిలీజ్ చేయనుంది. జనవరి 10న విడుదలకానున్న ఈ చిత్రంపై ఇప్పటికే బోలెడంత పాజిటివ్ క్రేజ్ నెలకొంది. త్రివిక్రమ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో పవన్ క్లాస్ లుక్ లో కనిపించనున్నాడు.