‘బాహుబలి – 2’ టీజర్ రిలీజ్ అయ్యేది అప్పుడేనా ?
Published on Sep 27, 2016 12:44 pm IST

baahubali
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘బాహుబలి -2’ దాదాపు అన్ని కీలక సన్నివేశాల ఘాటింగ్ పూర్తి చేసుకుంది. ఇక మిగిలిన టాకీ పార్ట్ ను కూడా నవంబర్ నాటికి పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఆ తరువాత ముఖ్యమైన గ్రాఫిక్స్ పనులను ప్రారంభిస్తాడట రాజమౌళి. ఇదిలా ఉంటే సినిమాకి సంబందించిన టీజర్ ను అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ విడుదల చేసిన అది టీజరా.. లేకపోతే మేకింగ్ వర్క్ వీడియో గాని, ప్రభాస్ లుక్స్ కి సంబందించిన వీడియో క్లిప్పింగ్ గాని అయ్యుంటుందా.. అనేది పెద్ద సందేహంగా మారింది. రాజమౌళి టీమ్ మాత్రం ఈ విషయంపై ఇంకా ఎలాంటి వివరాలు తెలపలేదు. ఇకపోతే ఈ చిత్రాన్ని 2017 ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

 
Like us on Facebook