‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నెక్స్ట్ సాంగ్ కి డేట్ ఫిక్స్!

MSG 8

మాస్ మహారాజ రవితేజ హీరోగా ఆషిక రంగనాథ్ అలాగే డింపుల్ హయతి హీరోయిన్స్ గా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఎంటర్టైనర్ చిత్రం “భర్త మహాశయులకు విజ్ఞప్తి” కోసం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన పాటలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అలాగే వీటితో పాటుగా వచ్చిన గ్లింప్స్ టీజర్ వంటివి కూడా మంచి రెస్పాన్స్ అందుకోగా ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ నెక్స్ట్ సాంగ్ ని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

ముగ్గురు లీడ్ నటీనటులు మీద మంచి మాస్ నెంబర్ ని ప్రెజెంట్ చేస్తున్నట్టుగా రివీల్ చేశారు. వామ్మో వాయ్యో అంటూ సాగే ఈ సాంగ్ తాలూకా ప్రోమోని ఈ సాయంత్రం విడుదల చేస్తుండగా ఫుల్ సాంగ్ ని జనవరి 2న విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మరి ఈసారి భీమ్స్ ఎలాంటి సాంగ్ ని అందిస్తాడో చూడాలి. ఇక ఈ చిత్రానికి ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ జనవరి 13న సినిమాని విడుదల చేస్తున్నారు.

Exit mobile version