“భగవంత్ కేసరి” రెండో సాంగ్ డేట్ ఫిక్స్.!

Published on Oct 1, 2023 1:03 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “భగవంత్ కేసరి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం ఇప్పుడు షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి సన్నద్ధం అవుతుండగా మేకర్స్ ఆల్రెడీ ఓ సాంగ్ ని లాంచ్ చేశారు. ఇక ఇపుడు ఈ చిత్రం నుంచి రెండో సాంగ్ ని లాంచ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

మరి ఉయ్యాలో ఉయ్యాలా అంటూ సాగే ఈ సాంగ్ పై ఓ బ్యూటిఫుల్ పోస్టర్ ని మేకర్స్ అయితే ఇప్పుడు లాంచ్ చేశారు. ఇందులో బాలయ్య తన పక్కన ఓ చిన్నారి కనిపిస్తున్నారు. ఇక దీనితో ఈ సాంగ్ ని అయితే ఈ అక్టోబర్ 4న రిలీజ్ చేస్టున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. థమన్ సంగీతం అందించిన ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇక ఈ చిత్రానికి షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహించగా ఈ అక్టోబర్ 19న చిత్రం రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :