రామ్ చరణ్ కొత్త సినిమా లాంచింగ్ డేట్ !

ram-charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిన్నటి వరకు తను నటించిన ‘ధృవ’, నిర్మించిన తన తండ్రి ‘ఖైదీ నెం 150’ పనుల్లో ఫుల్ బిజీగా గడిపారు. ప్రస్తుతం ఆ పనులన్నీ ఒక కొలిక్కి రావడంతో చరణ్ తన తరువాతి సినిమాపై దృష్టి పెట్టాడు. త్వరలో సుకుమార్ డైరెక్షన్లో చేయనున్న సినిమాకి ప్రారంభోత్సవ ముహుర్తాన్ని ఫిక్స్ చేసుకున్నాడు. జనవరి 30న పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ లాంచ్ కానుంది.

పూర్తి గ్రామీణ నైపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రంలో చరణ్ సరసన అనుపమ పరమేశ్వరన్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తారని వార్తలొస్తున్నాయి. అంతేగాక ఈ చిత్రంలో అలనాటి స్టార్ హీరోయి రాశి ఒక కీలక పాత్రలో నటించనుంది. ఇకపోతే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ సినిమాని పలు హిట్ చిత్రాల్ని అందించిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.