‘డీజే’ ఆడియో డేట్ ఫిక్సైంది !
Published on Jun 7, 2017 5:18 pm IST


ఇటీవలే విడుదలైన ట్రైలర్ తో దుమ్ము రేపుతున్న ‘దువ్వాడ జగన్నాథం’ త్వరలో మరో కార్యక్రమం జరుపుకోనుంది. ఇప్పటికే విడుదలైన పాటలు అభిమానుల్ని ఊపేస్తుండగా పూర్తి స్థాయి ఆడియో విడుదల వేడుకకు రంగం సిద్ధమవుతోంది. ఈ జూన్ నెల 11వ తేదీన హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఈ వేడుక జరగనుంది. మొదటి రెండు పాటల్లోనే మంచి కిక్ చూపించిన డీజే టీమ్ మిగిలిన పాటల్ని ఎలా రూపొందించి ఉంటారో వినాలని ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు.

ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్, పూజ హెగ్డేల మీద ఒక మాస్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోందని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. తన బ్యానర్లో రూపొందుతున్న 25వ ప్రాజెక్ట్ కావడంతో నిర్మాత దిల్ రాజు భారీగా ఖర్చు చేసి సినిమాను నిర్మిస్తున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతుండగా చిత్రాన్ని జూన్ 23న విడుదల చేయనున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

 
Like us on Facebook