తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గాయపడ్డ సింహం’ బాక్సాఫీస్ వద్ద తన గర్జనను వినిపించేందుకు సిద్ధమవుతోంది. క్రేజీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తుంది. అమెరికన్ డ్రీమ్ చుట్టూ తిరిగే కథాంశంతో, సెటైరికల్ హ్యూమర్ మరియు ఎమోషన్స్ కలగలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ‘ట్రైజర్’లో తరుణ్ భాస్కర్ తన సొంత సినిమా ‘పెళ్లి చూపులు’పై వేసుకున్న జోక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మే 1న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమాకు పవన్ సాదినేని సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా, స్వీకర్ అగస్తీ సంగీతం అందిస్తున్నాడు. మరి ఏప్రిల్ 25న రాబోయే ట్రైలర్ ఈ ‘సింహం’ రేంజ్‌ను ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి.
