గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తో ఇద్దరి కెరీర్ లో 15వ సినిమాగా చేస్తున్న లేటెస్ట్ చిత్రమే “గేమ్ ఛేంజర్”. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇపుడు ఈ సినిమా రిలీజ్ దగ్గరకి వస్తుంది. ఇక మన దేశంలో మాత్రమే కాకుండా యూఎస్ లో ఉన్న ప్రవాస తెలుగు రాష్ట్రాల జనం సహా నార్త్ ఆడియెన్స్ కూడా గేమ్ ఛేంజర్ కోసం ఎదురు చూస్తున్నారు.
మరి యూఎస్ లో గేమ్ ఛేంజర్ బుకింగ్స్ పై ఇపుడు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది. అక్కడ ఈ చిత్రానికి శ్లోక ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ లెవెల్లో రిలీజ్ చేస్తుండగా ఇపుడు ఫైనల్ గా బుకింగ్స్ కి డేట్ లాక్ చేసేసారు. అక్కడ ఈ చిత్రం డిసెంబర్ 14 నుంచి బుకింగ్స్ ఓపెన్ చేసుకోబోతుందట. మరి రీసెంట్ టైం లో వచ్చిన పుష్ప 2, దేవర, కల్కి 2898 ఎడి లాంటి చిత్రాలు మన స్టార్స్ నుంచి భారీ ప్రీమియర్స్ ని సెట్ చేసాయి. మరి వీటిలానే “గేమ్ ఛేంజర్” కూడా బ్లాస్ట్ చేస్తుందేమో చూడాలి.
USA lo #GameChanger racha racha begins from DEC 14th with bookings open ????????
Blistering days ahead….let’s kickstart the mania with a BANG! ????????
Global Star @AlwaysRamCharan @shankarshanmugh @SVC_official @MusicThaman pic.twitter.com/KSfJNXEOTK
— Shloka Entertainments (@ShlokaEnts) December 9, 2024