సెన్సార్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘జై సింహ’ !

నందమూరి బాలకృష్ణ 102వ చిత్రం ‘జై సింహ’ షూటింగ్ ఆఖరు దశలో ఉంది. దుబాయ్ లో చిత్రీకరించాల్సిన రెండు పాటలు మినహా మిగత టాకీ పార్ట్ మొత్తం పూర్తైంది. దీంతో చిత్ర యూనిట్ తదుపరి కార్యక్రమాల్లో భాగంగా సినిమాను సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధం చేస్తోంది. ఈ నెల 28న చిత్రాన్ని సెన్సార్ కు పంపనున్నారని తెలుస్తోంది.

ఇకపోతే ఈ చిత్ర ఆడియో వేడుకను ఈ నెల 24న అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. వచ్చే ఏడాది సంక్రాతి సందర్బంగా జనవరి 12న విడుదలకానున్న ఈ చిత్రంలో నయనతార ప్రధాన హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ నటి నటాషా దోషి, హరి ప్రియలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు.