‘జైలర్ 2’ నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఫస్ట్ సింగిల్‌కు డేట్ ఫిక్స్..!

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ దసరా కానుకగా థియేటర్లలోకి రానుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ సాలిడ్ అప్డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు.

ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాగ్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ఈ ఫస్ట్ సింగిల్ సాంగ్‌తో మొదలుపెడుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను ఆగస్టు 21న రిలీజ్ చేస్తున్నట్లు ఓ పవర్‌ఫుల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు.

ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటంతో ఫస్ట్ పార్ట్ కంటే సెన్సేషన్ మ్యూజికల్ ట్రీట్ ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ‘జైలర్ 2’ నుంచి రాబోయే ఈ ఫస్ట్ సింగిల్ సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version