‘ఖైధీ నెం 150’కి ఆడియో డేట్ ఫిక్సైంది !

khaidi150
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైధీ నెం 150’ గురించిన అప్డేట్స్ గురించి, ఈవెంట్స్ గురించి తెలుసుకోవాలని మెగా అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా 10 ఏళ్ల తరువాత చిరు చేస్తున్న ఈ సినిమా ఆడియో ఎలా ఉంటుందో, ఆడియో వేడుక ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవాలని ఆతురతగా ఉన్నారు. వారి కోసమే అన్నట్టుగా ఖైధీ నెం 150 ఆడియో వేడుక తేదీ ఫిక్సైంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ ఆడియో రీలీజ్ జరగనుంది.

ఈ వేడుకను విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించనున్నట్టు నగర మేయర్ తెలిపారని సమాచారం. దీంతో మెగా అభిమానులంతా ఈ వేడుకకు సన్నాహాలు మొదలుపెట్టేశారు. మునుపెన్నడూ జరగనంత వైభవంగా ఈ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారట. ఇకపోతే ఈ సినిమా టీజర్ ను డిసెంబర్ 8న అనగా చరణ్ ‘ధృవ’ విడుదలకు ఒక్కరోజు ముందు రిలీజ్ చేసి 9వ తేదీ నుండి ‘ధృవ’ ప్రదర్శింపబడే అన్ని థియేటర్లలో ప్రదర్శించనున్నారు.