మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’పై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తుండగా అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నారు.
దీంతో ఈ చిత్ర ప్రమోషన్స్‌ను మేకర్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్‌ను అక్టోబర్ 21న రిలీజ్ చేస్తున్నామని.. ఈ ట్రైలర్ అందరికీ నచ్చే విధంగా ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇక ఈ సినిమాకు జి.వి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 31న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.