‘నిన్ను కోరి’ ట్రైలర్ తేదీ ఖరారు


నాని ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. సినిమా సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద నాని రేంజ్ కూడా పెరుగుతోంది. నాని ప్రస్తుతం ‘ నిన్ను కోరి’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడిపోయాయి. రొమాంటిక్ మూవీ గా రాబోతున్న ఈ చిత్ర టీజర్ , ఇప్పటికే విడుదల చేసిన ‘అడిగా.. అడిగా’ అనే పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా ‘నిన్ను కోరి’ చిత్ర యూనిట్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది. జూన్ 17 న ఉదయం 10 గంటలకు ట్రైలర్ ని విడుదల చేయనున్నారు. త్వరలోనే చిత్రంలో మిగిలిన పాటలను కూడా విడుదల చేయనున్నారు. విడుదలకు ముందు మంచి హైప్ వచ్చేలా ‘నిన్ను కోరి’ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. నివేద థామస్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆది పినిశెట్టి ఈ చిత్రంలో ఓ కీలక పాత్రని పోషిస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. జులై 7 న ‘నిన్ను కోరి’ విడుదలకు సిద్ధమవుతోంది.