‘రంగస్థలం 1985’ టీజర్ రిలీజ్ డేట్స్ ఫిక్స్ !

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘రంగస్థలం 1985’ చిత్రం కొన్ని నెలల నుండి షూటింగ్ జరుపుకుంటూ ఎట్టకేలకు తుది దశకు చేరుకుంది. 80 ల దశకంలో వాతావరణంలో జరిగే కథగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అంతేగాక సినిమా మొదలై ఇన్నాళ్లు కావొస్తున్నా ఫస్ట్ లుక్ మినహా మరే అప్డేట్ లేకపోవడంతో అభిమానుల్లో కింత నిరుత్సాహం నెలకొంది.

వాళ్ళ నిరుత్సాహాన్ని పోగొట్టేలా కొద్దిసేపటి క్రితమే టీజర్ రిలీజ్ ఎప్పుడో ప్రకటించింది టీమ్. ఈ నెల 24న సేయఁటర్మ్ 4 గంటల 15 నిముషాలకు టీజర్ విడుదలకానుంది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 30న రిలీజ్ చేయనున్నారు. దేవి శ్రీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సమంత కథానాయకిగా నటిస్తుండగా ఆది పినిశెట్టి, అనసూయలు పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.