లేటెస్ట్..”టైగర్ నాగేశ్వరరావు” ఫస్ట్ సింగిల్ కి డేట్ ఫిక్స్!

Published on Sep 1, 2023 11:22 am IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ నపూర్ సనన్ హీరోయిన్ గా దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ ఓ పక్క శరవేగంగా కంప్లీట్ అవుతూ మరోపక్క ఒకో అప్డేట్ ని కూడా అందిస్తూ వస్తుంది.

మరి ఇప్పుడు ఈ సినిమా నుంచి అవైటెడ్ ఫస్ట్ సింగిల్ పై అయితే మేకర్స్ అప్డేట్ ని అందించారు. మరి ఈ సినిమా నుంచి మొదటి పాటని అయితే ఈ సెప్టెంబర్ 5 న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా డ్యూయెట్ పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం మ్యూజిక్ పై కూడా మంచి బజ్ ఉంది.

సంగీత దర్శకుడు జివి ప్రకాష్ టీజర్ కి ఇచ్చిన స్కోర్ మంచి హైలైట్ కాగా సాంగ్స్ కోసం కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ మొదటి సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా పాన్ ఇండియా వైడ్ ఈ చిత్రం ఈ అక్టోబర్ 19న ఘనంగా విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం :