రెండో పాట రిలీజ్ కి సిద్ధం అయిన మేజర్’ !

Published on May 16, 2022 7:05 pm IST

యంగ్ హీరో అడివి శేష్ హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్న సినిమా ‘మేజర్’. ఈ సినిమా నుంచి తాజాగా మరో సాంగ్ రిలీజ్ కి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. శ్రీచరణ్ పాకాల స్వరపరచిన ఈ చిత్రంలోని ఓహ్ ఇషా అనే రెండో పాటను మే 18, 2022న విడుదల చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.

.
ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ మొత్తానికి గ్రిప్పింగ్ గా సాగి, సినిమా పై అంచనాలను పెంచేసింది. కాగా మేజర్‌ చిత్రంలో సాయి మంజ్రేకర్ మరియు శోభితా ధూళిపాళ లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ బహు భాషా చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు A+S మూవీస్ పతాకాలపై సంయుక్తం నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :