‘డేవిడ్‌ రెడ్డి’ క్లైమాక్స్ మనోజ్ స్టంట్స్ ?

David-Reddy-1

రాకింగ్ స్టార్ మంచు మనోజ్‌ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీ ‘డేవిడ్‌ రెడ్డి’. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా క్లైమాక్స్ షూట్ ను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్లైమాక్స్ కోసం మనోజ్ యాక్షన్ స్టంట్స్ ను ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నట్టు ఈ క్లైమాక్స్ లో ఓ స్పెషల్ గెస్ట్ రోల్ కూడా ఉందని టాక్. మరి ఈ పాత్రలో ఎవరు కనిపిస్తారో చూడాలి.

ఇక ‘డేవిడ్‌ రెడ్డి’ కథ విషయానికొస్తే.. స్వాతంత్రానికి పూర్వం జరిగిన కథ ఇది. బ్రిటిష్‌ వారిపై పోరాడిన ‘డేవిడ్‌ రెడ్డి’ అనే యోధుడి కథగా రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ‘వార్‌ డాగ్‌’ అనే బైక్‌ను రూపొందించారు. దాని బరువు దాదాపు 700 కేజీలు. సినిమాలో అది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అన్నట్టు ఈ సినిమాలో మనోజ్‌ సరసన ‘ప్రిన్స్‌’ (కోలీవుడ్‌ మూవీ) హీరోయిన్‌ మరియా నటించబోతుంది.

Exit mobile version