‘పుష్ప’ రాజ్‌గా మారిపోయిన డేవిడ్ వార్నర్.. తగ్గదేలేదన్న బన్నీ..!

Published on Dec 12, 2021 2:00 am IST


ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, హైదరాబాద్ సన్ రైజర్స్ మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. గతంలో తన భార్యతో కలిసి చేసిన టిక్‌టాక్‌ వీడియోలతో వార్నర్ తెలుగు వారికి బాగా దగ్గరయ్యాడు. అల్లు అర్జున్‌ ‘అల వైకుంఠపురం’లోని ‘బుట్టబొమ్మ’, మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో మైండ్‌ బ్లాక్‌ పాటలకు స్టెప్పులేసి ఫుల్ పాపులారిటీని తెచ్చుకున్నాడు.

కొద్ది రోజులుగా క్రికెట్‌లో బిజీగా అయిన వార్నర్ మళ్లీ తన టాలెంట్‌ని బయటపెట్టాడు. తాజాగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుష్ప సినిమాలోని ‘యే బిడ్డా.. ఇది నా అడ్డా..’ అనే పాటలో బన్నీ ప్లేస్‌లో తన ఫేస్‌ని మార్పింగ్ చేసిన వీడియోను వార్నర్ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసి, దీనికో క్యాప్షన్‌ పెట్టండి అంటూ రాసుకొచ్చాడు. ఈ వీడియోను చూసిన విరాట్‌ కోహ్లీ ‘నువ్వు ఓకే నా!’ అని కామెంట్‌ చేయగా అందుకు వార్నర్ ‘కాస్త గొంతు పట్టేసినట్టుందని బదులిచ్చాడు. ఇక అల్లు అర్జున్ కూడా స్పందిస్తూ ‘మై బ్రదర్‌ వార్నర్‌’.. “తగ్గేదేలే’’ అని అన్నాడు.

సంబంధిత సమాచారం :