యంగ్ హీరో ఆది, రాహుల్ రవీంద్రన్ హీరోలుగా ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా అఖీవా హీరోయిన్స్ గా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘గాలిపటం’. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి అన్ని చోట్ల నుండి పాజిటివ్ టాక్ రావడమే కాకుండా కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టుకుంటోంది. మాకు అందిన సమాచారం ప్రకారం వీకెండ్ లో థియేటర్స్ ఫుల్ అవడమే కాకుండా, వీక్ డే అయిన ఈ రోజు కూడా ఇరు రాష్టాలలోని చాలా ప్రాంతాల్లో 80% థియేటర్స్ ఫుల్ అవ్వడం విశేషం.
వీక్ డేలో కూడా థియేటర్స్ ఫుల్ అవుతుండడంతో డిస్ట్రిబ్యూటర్స్ చాలా ఆనందంగా ఉన్నారు. డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సంపత్ నంది ఈ సినిమాని నిర్మించడమే కాకుండా కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ ని కూడా అందించాడు. నేటితరం ప్రేమలకి అద్దం పట్టేలా ఉండే ఈ సినిమాలో తెలుగులో వస్తున్న రొటీన్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా క్లైమాక్స్ ని డిజైన్ చేసారు. నవీన్ గాంధీ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించాడు.
