“డియర్ మేఘ”ను థియేటర్‌లో చూడడం మిస్ కాకండి – మేఘా ఆకాష్

Published on Sep 4, 2021 8:11 pm IST


మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ”డియర్ మేఘ”. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా నిన్న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌ని తెచ్చుకుంది. ఫిలిం ఛాంబర్‌లో నేడు ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది.

ఈ సందర్భంగా హీరోయిన్ మేఘా ఆకాష్ మాట్లాడుతూ డియర్ మేఘకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని, ఒక మంచి ఎమోషనల్ మూవీ ప్రేక్షకులకు నచ్చడం సంతోషంగా ఉందని అన్నారు. నా కెరీర్‌లో చేసిన కంప్లీట్ పర్మార్మెన్స్ ఉన్న సినిమా ఇదని, అన్ని రకాల ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయని, ఈ సినిమాను థియేటర్‌లో చూడడం మిస్ కాకండని అన్నారు.

హీరో ఆదిత్ అరుణ్ మాట్లాడుతూ డియర్ మేఘకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తుందని, నిన్న థియేటర్స్ విజిట్ చేశామని ఈ సినిమాను చూస్తున్న వారంతా బాగా ఎంజాయ్ చేశారని, చివరలో మాత్రం బాధపడటం గమనించానని అన్నారు. కొందరు ఫోన్స్ చేసి మరీ సినిమా చివరలో అలా ఎందుకు చేశారని అంటున్నారని, అదేంటో తెలియాలంటే మీరు థియేటర్‌లో సినిమాను చూడాలని అన్నారు. థియేటర్స్ ఓనర్స్ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ ఉందని, ప్రేక్షకులు కూడా మా సినిమాకు బాగానే వస్తున్నట్టు తెలుస్తుందని అన్నారు. మేఘ పర్మార్మెన్స్ చాలా బాగుందని, నాకు మదర్ క్యారెక్టర్ చేసిన పవిత్ర లోకేష్ అద్భుతంగా నటించారని అన్నారు. త్వరలో వరంగల్, కరీంనగర్ టూర్ ప్లాన్ చేస్తున్నామని అన్నారు.

హీరో అర్జున్ సోమయాజుల మాట్లాడుతూ తెలుగులో నాకు ఇది ఫస్ట్ మూవీనే అయినా కూడా ఇంత మంచి చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడు సుశాంత్, నిర్మాత అర్జున్ గారికి చాలా థ్యాంక్స్ అని అన్నారు. డియర్ మేఘతో మా జర్నీ ఎంతో స్పెషల్ అని, మేము నటించేప్పుడు ఎలా ఫీలయ్యామో, ఇవాళ ప్రేక్షకులు కూడా అలాగే అనుభూతి చెందుతున్నారని, డియర్ మేఘను సక్సెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు.

సంబంధిత సమాచారం :