ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న ‘డియర్ మేఘ’ !

Published on Aug 29, 2021 10:45 pm IST

‘మేఘా ఆకాష్’, ‘అరుణ్ ఆదిత్’ హీరోహీరోయిన్లుగా వస్తోన్న సినిమా ‘డియర్ మేఘ’. కాగా తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ ను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో మేఘ ఆకాష్ లుక్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. తన ప్రేమను తనలో దాచుకుని బాధపడే ఓ అమ్మాయి కథే డియర్ మేఘ అని ట్రైలర్‌ చూస్తుంటే అర్థం అవుతోంది.

ఇక మేఘ సరసన అదితిఅరుణ్, అర్జున్ సోమయాజుల హీరోలుగా నటించారు. ట్రైలర్‌ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. అన్నట్టు అన్ కండిషనల్ లవ్ అంటే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తారట. ఇక ట్రైలర్ ను చూస్తుంటే ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర లోపల చాలా అల్లరి పిల్ల, అయితే బయటకు మాత్రం చాలా కామ్ గా కూల్ గా కనిపిస్తోందట.

సంబంధిత సమాచారం :