సినిమా రిలీజ్ పట్ల ఎలాంటి టెంక్షన్ లేదన్న కొత్త డెబ్యూ డైరెక్టర్ !

nnnbf
ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఎక్కువగా అందరి దృష్టినీ ఆకర్షించిన చిత్రం ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’. టీజర్, ట్రైలర్స్, ప్రోమోస్ తో సినిమాలో విభిన్నమైన అంశం ఏదో ఉందన్న ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు భాస్కర్ బండి తెరకెక్కించారు. దాదాపు దశాబ్దం పాటు ఇండస్ట్రీలోని పలు పెద్ద దర్శకులు, టెక్నీషియన్స్ దగ్గర పనిచేసిన భాస్కర్ బండి ఇది తన మొదటి చిత్రమే అయినా కూడా రిలీజ్ పట్ల ఎలాంటి టెంక్షన్, భయం లేవని, చాలా కాన్ఫిడెంట్ గా, రిలాక్స్డ్ గా ఉన్నానని అంటున్నారు.

ఈ చిత్రం తండ్రి, కూతుళ్ళ మధ్య నడిచే అనుబంధం ఆధారంగా రూపొందిందని, కానీ కాస్త భిన్నమైన, కొత్త కోణంలో ఆ అనుబంధాన్ని చూపామని భాస్కర్ బండి తెలిపారు. ఇప్పటికే సెలబ్రిటీల ద్వారా ప్రమోషన్లు చేయడం వంటి రకరకాల పద్దతుల ద్వారా సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడంలో చిత్ర టీమ్ బాగానే సక్సెస్ అయింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్న ఈ చిత్రం ఈరొజే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని బెక్కం వేణుగోపాల్ నిర్మించారు.