డిసెంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో థియేటర్స్‌లో సందడి చేయనున్న సినిమాలివే..!

Published on Nov 30, 2021 2:20 am IST

కరోనా తగ్గుముఖం పట్టి థియేటర్లు తెరుచుకున్నాక కూడా ఇప్పటివరకు చిన్న సినిమాలు తప్ప చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదనే చెప్పాలి. అయితే డిసెంబర్ మరియు జనవరిలో భారీ బడ్జెట్ సినిమాలు మరియు పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఈ క్రమంలో డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో ఏ ఏ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయనేది ఓ లుక్కేద్దాం.

* నందమూరి బాలకృష్ణ, ప్రగ్యాజైస్వాల్‌ హీరో హీరోయిన్లుగా మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న చిత్రం “అఖండ”. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

* మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా, ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “మరక్కార్”. ‘అరేబియా సముద్ర సింహం’ అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌ మీద కాన్ఫిడెంట్ గ్రూప్ సంస్థతో కలిసి ఆంటోని పెరంబువూర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

* సత్యదేవ్‌, నిత్యమీనన్‌, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “స్కైలాబ్‌”. విశ్వక్‌ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను పృథ్వీ పిన్నమరాజు నిర్మించారు. డా.రవి కిరణ్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌ 4న విడుదలవుతోంది.

* పూర్ణ ప్రధాన పాత్రలో, తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన చిత్రం “బ్యాక్ డోర్”. డిసెంబర్‌ 3న ఈ సినిమా థియేటర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

* టాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ సొంతం చేసుకున్న ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రాన్ని ‘తడప్‌’ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కుమారుడు అహాన్‌ శెట్టి ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. అహాన్‌కు జంటగా తారా సుతారియా నటిస్తున్నారు. మిలాన్‌ లుతారియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సంబంధిత సమాచారం :