“హిట్ 2” కి వరల్డ్ వైడ్ డీసెంట్ బిజినెస్.!

Published on Nov 29, 2022 9:24 pm IST


యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా ఖిలాడీ ఫేమ్ నటి మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “హిట్ 2”. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రం సాలిడ్ బజ్ తో రిలీజ్ కి దగ్గరలో ఉంది. ఇక నిన్ననే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా జరుపుకున్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఈ అవైటెడ్ సినిమా అయితే వరల్డ్ వైడ్ ఎంత బిజినెస్ తెలుస్తుంది.

మరి ఈ సినిమా ఐటీ టోటల్ గా 14 కోట్లకి పైగా బిజినెస్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఇది శేష్ కెరీర్ లో మరో మంచి డీల్ అని చెప్పాలి. ఎలాగో సినిమాపై మంచి బజ్ అయితే ఉంది. మరి ఓపెనింగ్స్ కూడా సాలిడ్ గా వచ్చే అవకాశం ఉన్నట్టుగా ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ థ్రిల్లర్ ఎలాంటి వసూళ్లు అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి వాల్ పోస్టర్ సినిమాస్ వారు నిర్మాణం వహించగా ఈ డిసెంబర్ 2న రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :