హిందీలో “పొన్నియిన్ సెల్వన్” కి డీసెంట్ వసూళ్లు.?

హిందీలో “పొన్నియిన్ సెల్వన్” కి డీసెంట్ వసూళ్లు.?

Published on Oct 5, 2022 9:25 AM IST

కోలీవుడ్ నుంచి ఎన్నో అంచనాలు పెట్టుకొని రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ భారీ చిత్రం “పొన్నియిన్ సెల్వన్” కోసం అందరికీ తెలిసిందే. లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం కాంబోలో చియాన్ విక్రమ్ సహా కార్తీ అలాగే ఎందరో బిగ్ స్టార్స్ నటించిన ఈ చిత్రం భారీ వసూళ్లు అందుకుంటుంది. అసలు టాక్ తో సంబంధం లేకుండా ఓవర్సీస్ లో అయితే సాలిడ్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం హిందీలో కూడా డీసెంట్ పెర్ఫామెన్స్ ని అందుకుంటున్నట్టు తెలుస్తుంది.

డీసెంట్ గానే ఓపెనింగ్స్ స్టార్ట్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు అయితే 11 కోట్ల మార్క్ కి హిందీ వెర్షన్ లో ఇండియాలో వసూళ్లు అందుకుందట. మొత్తానికి అయితే పాన్ ఇండియా రిలీజ్ లో పొన్నియిన్ సెల్వన్ తమిళ్ మినహా అన్ని చోట్ల పర్వాలేదనే రేంజ్ లోనే ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాకి అయితే ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు