డీసెంట్ రన్ టైం లాక్ చేసుకున్న “ఆడవాళ్లు మీకు జోహార్లు”.!

Published on Mar 3, 2022 4:00 pm IST

ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “ఆడవాళ్లు మీకు జోహార్లు” కూడా ఒకటి.

మంచి ప్రమోషన్స్ మరియు అంచనాలతో ఇప్పుడు రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ చిత్రం తాలూకా రన్ టైం ఎంతో ఇప్పుడు తెలుస్తుంది. ఈ చిత్రానికి గాను మేకర్స్ రీసెంట్ రన్ టైం ని లాక్ చేశారట. ఈ సినిమా 141 నిమిషాలు నిడివి ఉంటుందట. అంటే ఫస్ట్ నుంచి ఎండ్ కార్డ్స్ వరకు కలిపి సుమారు రెండు గంటల 21 నిమిషాలు అని చెప్పాలి.

అయితే ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని మంచి రన్ టైం అని చెప్పాలి. మరి రేపు రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :