ప్రభాస్ “రాధే శ్యామ్” ఫస్ట్ టైమ్ ఎంత టీఆర్పీ సాధించిందంటే?

Published on Jul 7, 2022 4:15 pm IST


పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్ లుగా నటించిన చిత్రం రాధే శ్యామ్. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ లవ్ డ్రామా థియేటర్ల లో భారీగా విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకోవడం లో విఫలం అయ్యింది. అయితే ఈ చిత్రం తాజాగా బుల్లితెర ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా వచ్చిన ఈ చిత్రం టీఆర్పీ రేటింగ్ తాజాగా రావడం జరిగింది.

ఈ చిత్రం 8.25 రేటింగ్ ను సాధించడం జరిగింది. అయితే పెద్ద చిత్రాలకు, అది కూడా ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోలకు ఇలాంటి టీఆర్పీ రేటింగ్ చాలా తక్కువే అని చెప్పాలి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కే, సలార్, ఆదిపురుష్ లతో పాటుగా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం లో తెరకెక్కుతున్న స్పిరిట్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాల పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :