బ్లాక్ బస్టర్ ‘సీతారామం’ టెలివిజన్ ప్రీమియర్ టిఆర్పి రేటింగ్ ఎంతంటే ?

బ్లాక్ బస్టర్ ‘సీతారామం’ టెలివిజన్ ప్రీమియర్ టిఆర్పి రేటింగ్ ఎంతంటే ?

Published on Dec 3, 2022 7:01 AM IST

హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన లేటెస్ట్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ మూవీ సీతారామం. సి అశ్వినీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.

విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించిన ఈ మూవీలో రష్మిక మందన్న కీలక రోల్ చేసారు. అయితే విషయం ఏమిటంటే, ఇటీవల ఈ మూవీని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానల్ లో ప్రసారం చేయగా దానికి 9.6 టిఆర్పి లభించింది. ఇటీవల రిలీజ్ అయి సక్సెస్ అందుకున్న పలు సినిమాల కంటే ఇది ఎక్కువ అనే చెప్పాలి. మొత్తంగా ఈ విధంగా అటు వెండితెరపై అలానే ఇటు బుల్లితెరపై సీతారామం ఆడియన్స్ మనసు దోచుకుని తన సత్తా చాటిందనే చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు