బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపిక పదుకొనే తెలుగులో ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడి’ చిత్రంతో సాలిడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఇప్పుడు వరుసగా టాలీవుడ్ చిత్రాల్లో అవకాశం దక్కించుకుంటోంది ఈ బ్యూటీ.
ఇప్పటికే ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ చిత్రంలో దీపిక సెలెక్ట్ అయ్యింది. అయితే, తాజాగా ఆమెను ఈ సినిమా నుంచి తప్పించాడట దర్శకుడు సందీప్ రెడ్డి. దీంతో ఇప్పుడు ఆమె మరో టాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్‌లోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ గురించి అందరికీ తెలిసిందే.
పాన్ ఇండియా చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. అయితే, ఈ సినిమాలో దీపకను తీసుకున్నారనే టాక్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఏదేమైనా టాలీవుడ్‌లోనే దీపిక చక్కర్లు కొడుతుందని.. ఒకటి కాకపోతే మరో సినిమాలో ఆమె ఛాన్స్ దక్కించుకుంటుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది.