కిచ్చా సుదీప్‌తో దీప్‌శిఖ చంద్రన్ కన్నడ ఎంట్రీ.. ‘మార్క్ క్వీన్’గా క్రేజ్!

Deepshikha Chandran

ప్రముఖ నటి దీప్‌శిఖ చంద్రన్ కన్నడ చిత్ర పరిశ్రమలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. శాండిల్‌వుడ్ బాద్‌షా కిచ్చా సుదీప్‌ సరసన ఆమె నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదల కాకముందే ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌, ఫస్ట్ లుక్స్‌ చూసి ఫిదా అయిన అభిమానులు.. దీప్‌శిఖను ‘మార్క్ క్వీన్’గా పిలుచుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

కిచ్చా సుదీప్‌తో కలిసి పనిచేయడం తన కల అని, అది ఇప్పుడు నిజమైందని దీప్‌శిఖ ఆనందం వ్యక్తం చేశారు. ఆయనలోని క్రమశిక్షణ, వృత్తిపట్ల ఉండే అంకితభావం తన నటనను మెరుగుపరుచుకోవడంలో ఎంతగానో దోహదపడ్డాయని ఆమె పేర్కొన్నారు. సుదీప్ వంటి స్టార్‌తో ప్రయాణం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపారు.

అలాగే, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘సత్యజ్యోతి ఫిల్మ్స్’ బ్యానర్‌లో తన ప్రయాణం ప్రారంభమవ్వడం పట్ల దీప్‌శిఖ హర్షం వ్యక్తం చేశారు. ఆ సంస్థ విలువలు, నిర్మాణ నాణ్యత తనకు ఎంతో నేర్పించాయని, కెరీర్ ఆరంభంలోనే ఇంతటి గొప్ప బ్యానర్‌లో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. సినిమా రిలీజ్‌కు ముందే ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణ తనకు మరింత బాధ్యతను, ఉత్సాహాన్ని ఇస్తోందని ఆమె వెల్లడించారు.

Exit mobile version