ఆకట్టుకుంటున్న “డేగల బాబ్జీ” లేటెస్ట్ స్టిల్..!

Published on Oct 9, 2021 11:05 pm IST


టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం డేగల బాబ్జీ. ‘ఒత్త సెరప్పు అళవు-7’ అనే తమిళ చిత్రాన్ని డేగల బాబ్జీ పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, యశ్ రిషి ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను ఇప్పటికే హరీష్ శంకర్ విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో లేటెస్ట్ స్టిల్‌ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న బండ్ల గణేశ్ ఈ మూవీ కథ చాలా బాగుంటుందని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ని జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :