“డేగల బాబ్జీ” ట్రైలర్ ను విడుదల చేయనున్న పూరి జగన్నాథ్!

Published on Nov 7, 2021 5:30 pm IST


బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం డేగల బాబ్జి. ఈ చిత్రం ను యష్ రిషి ఫిల్మ్స్ బ్యానర్ పై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. తమిళం లో సూపర్ హిట్ సాధించిన ఒత్త సేరుప్పు సైజ్ 7 కి ఈ చిత్రం రీమేక్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదలై ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ పై బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదిక గా ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఈ చిత్రం ట్రైలర్ ను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేస్తున్నట్లు ఒక పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఈ చిత్రం ట్రైలర్ ను రేపు ఉదయం 9:35 గంటలకు పూరి జగన్నాథ్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాక ట్రైలర్ ను విడుదల చేస్తున్నందుకు పూరి జగన్నాథ్ కి బండ్ల గణేష్ థాంక్స్ తెలిపారు. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :