ఢిల్లీ & రోలెక్స్ … కలిసి నటిస్తారా …. ?

Published on Aug 6, 2022 1:00 am IST

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కిన మూవీ ఖైదీ. రెండున్నరేళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది. ఈ మూవీలో కార్తీ, ఢిల్లీ అనే పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అనంతరం విజయ్ తో మాస్టర్ మూవీ తీసిన మంచి విజయం అందుకున్న లోకేష్, లేటెస్ట్ గా కమల్ హాసన్ తో తీసిన మూవీ విక్రమ్ హిట్ లిస్ట్. మల్టివర్స్ మూవీగా తెరకెక్కిన విక్రమ్ కూడా అత్యద్భుత విజయం అందుకుంది. ఇక ఇందులోని ఒక సన్నివేశంలో ఢిల్లీ లారీ నడిపే సీన్ ని చూపించారు, అయితే అందులో కార్తీ కనపడనప్పటికీ ఆయన వాయిస్ మనకు వినిపిస్తుంది.

అలానే క్లైమాక్స్ లో రోలెక్స్ పాత్రలో స్పెషల్ అఫియరెన్స్ ఇచ్చి అదరగొట్టారు సూర్య. ఆ పాత్ర ద్వారా సూపర్ క్రేజ్ అందుకున్నారు సూర్య. అయితే త్వరలో ఇలయతలపతి విజయ్ తో ఒక మూవీ చేయనున్న లోకేష్ కనకరాజ్, అనంతరం విక్రమ్ 2 మూవీ చేయనున్నారు. అందులో రోలెక్స్ అలానే ఢిల్లీ లని కలిసి నటించే సన్నివేశాలు ఆయన చూపిస్తారా లేదా అనే ఆసక్తికరమైన చర్చ ప్రస్తుతం సూర్య, కార్తీ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో ఉంది. కాగా దీనిపై ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతున్నప్పటికీ, రాబోయే రోజుల్లో ఈ మూవీ స్క్రిప్ట్ పూర్తి చేసిన అనంతరం స్వయంగా దర్శకుడు లోకేష్ ఈ విషయమై క్లారిటీ ఇవ్వాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

సంబంధిత సమాచారం :