అఫీషియల్: దేశముదురు రీ రిలీజ్ కి రెడీ!

Published on Mar 28, 2023 7:03 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన దేశముదురు చిత్రం రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ పాన్ ఇండియా హీరో పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 6 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన ఒకటి వెలువడింది. బాల గోవింద్ మాస్ స్వాగ్ ను మరోసారి థియేటర్ల లో చూడటానికి సిద్దం గా ఉండండి అంటూ మేకర్స్ తెలిపారు.

అల్లు అర్జున్ నేటితో తన సినీ పరిశ్రమ లో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఈ హీరో చిత్రం రీ రిలీజ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం లో హన్సిక హీరోయిన్ గా నటించగా, దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :