మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘చుట్టాలబ్బాయి’

chuttalabbai-(5)
యంగ్ హీరో ‘ఆది’ నటించిన ‘చుట్టాలబ్బాయి’ చిత్రం నిన్ననే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి షో తరువాత విమర్శకుల నుండి మిశ్రమ స్పందనను రాబట్టుకున్న ఈ చిత్రం కలెక్షన్ల విషయంలో మాత్రం జోరు చూపించింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 3 కోట్ల గ్రాస్ సాధించింది. ఆది కెరీర్ లోనే ఇదే అతిపెద్ద ఓపెనింగ్ కావడం విశేషం. అలాగే ఒక్క నైజాం లోనే ఈ చిత్రం రూ. కోటి గ్రాస్ వసూలు చేసింది.

‘భాయ్’ పరాజయంతో నిరుత్సాహంలోకి వెళ్లిన దర్శకుడు ‘వీరభద్రం’కు ఈ విజయం మంచి రిలీఫ్ ఇచ్చింది. కంప్లీట్ ఎంటర్టైనర్ కావడం వల్ల బి, సి సెంటర్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారు. ఇందుకు కారణం నిర్మాతలు ‘వెంకట్ తలారి, రామ్ తల్లూరి’ లు సినిమాని జనాల్లోకి తీసుకెళ్లిన విధానమే అని చెప్పొచ్చు. కొత్త వాళ్లైనప్పటికీ ఈ ఇద్దరూ ప్రమోషన్ కు ఉన్న ప్రతి దారిని సద్వినియోగం చేసుకుని జనాల్లో సినిమాపై మంచి ఆసక్తిని క్రియేట్ చేశారు. ‘థమన్’ సంగీతం అందించిన ఈ చిత్రంలో ‘నమిత ప్రమోద్’ హీరోయిన్ గా నటించింది.