
తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమాలు బాహుబలి, రుద్రమదేవి.. ఈ రెండు సినిమాలా తర్వాత తెలుగు చలన చిత్ర చరిత్రలో మునుపెన్నడూ రాని వరల్డ్ వార్ II కథతో రానున్న సినిమా ‘కంచె’. ఈ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను కాలర్ ఎగరేసుకునేలా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా కనిపించనున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ సినిమా అక్టోబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో తెలుగు ఆడియన్స్ ని అబ్బురపరిచే వరల్డ్ వార్ II ఎపిసోడ్స్ ఉంటాయని ముందుకు నుంచి చెబుతూ వస్తున్నారు. ఈ విషయం గురించి మేము తెలుసుకోగా కంచె సినిమాలో మెయిన్ వరల్డ్ వార్ II ఎపిసోడ్ సుమారు 10 నిమిషాల ఉంటుందట. ఈ 10 నిమిషాల వార్ ఎపిసోడ్ చూసే ఆడియన్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా, సీట్ చివర్లో కూర్చొని చూసేలా చేస్తుందని సమాచారం. ఈ వార్ ఎపిసోడ్ మాత్రమే కాకుండా హీరో విలన్ మధ్య వచ్చే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అదిరిపోయేలా ఉంటాయని సమాచారం. అంతర్లీనంగా సాగే ప్రమకతతో పాటు వరల్డ్ వార్ II బ్యాక్ డ్రాప్ కూడా సినిమాకి పెద్ద హెల్ప్ అవుతుందని సమాచారం.
వరుణ్ తేజ్ సరసన ప్రాగ్య జైశ్వాల్ హీరోయిన్ గా కనిపించనుంది. బాలీవుడ్ యాక్టర్ నికేతన్ దీర్ విలన్ గా కనిపించనున్న ఈ సినిమాకి రాజీవ్ రెడ్డి – సాయి బాబులు నిర్మాతలు.