మెగా హీరోతో పూరి సినిమా !

రామ్ చరణ్ ను తెలుగు తెరకు పరిచయం చేసింది పూరి జగన్నాధ్. ఈ సినిమా తరువాత వీరిద్దరు మరోసారి సినిమా చెయ్యబోతునట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘మెహబూబా’ సినిమా తరువాత పూరి, చరణ్ కలిసి సినిమా చెయ్యబోతున్నారు. ప్రముఖ నిర్మాత కే.ఎస్.రామారావ్ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

గతంలో పూరి జగన్నాద్, కే.ఎస్.రామారావ్ ప్రభాస్ తో ‘బుజ్జిగాడు’ సినిమా చేసారు. చాలా గ్యాప్ తరువాత వీరిద్దరు చరణ్ తో సినిమా చెయ్యబోతుండడం విశేషం. ఈమధ్య పూరి, వెంకటేష్ తో సినిమా చెయ్యబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాని ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సమాచారం. ‘మెహబూబా’ సినిమా రషెస్ చూసిన కొద్దిమంది సినీ ప్రముఖులు సినిమా బాగా వచ్చినదని చెబుతున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నారు.

Exit mobile version