సోనాక్షి సిన్హా పెళ్లి వేదిక, గెస్టుల డీటెయిల్స్..

సోనాక్షి సిన్హా పెళ్లి వేదిక, గెస్టుల డీటెయిల్స్..

Published on Jun 12, 2024 10:15 AM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా రీసెంట్ గానే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్ “హీరామండి” (Heeramandi) లో కనిపించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సిరీస్ తో పాటుగా బాలీవుడ్ భారీ చిత్రం “బడే మియా చోటే మియా” సినిమాల్లో ఆమె కనిపించింది. ఇక ఈ ఇదిలా ఉండగా జస్ట్ కొన్ని రోజులు కితమే ఆమె పెళ్లి కోసం కొన్ని రూమర్స్ వైరల్ గా మారాయి.

తన బాయ్ ఫ్రెండ్ జహీర్ తో చాలా కాలం డేటింగ్ లో ఉన్న తర్వాత ఫైనల్ గా పెళ్ళికి సిద్ధం అయ్యింది. మరి ఈ జూన్ 23న పెళ్లి డేట్ ఫిక్స్ కాగా ఇప్పుడు వేదిక, గెస్టుల డీటెయిల్స్ తెలుస్తున్నాయి. దీని ప్రకారం వీరి పెళ్లి ముంబైలోని బాస్టియన్ లో అట్టహాసంగా జరగనుందట.

అలాగే ఈ పెళ్ళికి గాను బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంకా ఆమీర్ తదితర స్టార్ లు హాజరు కానున్నారట. అలాగే ఇండస్ట్రీలో గల సోనాక్షి స్నేహితులు కూడా రానున్నట్టుగా వినిపిస్తుంది. ఇక దీనిపై మరిన్ని వివరాలు రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు