దేవదాస్ లేటెస్ట్ కలక్షన్స్ !

devdas2

నాగార్జున , నాని కలిసి నటించిన మల్టీ స్టారర్ దేవదాస్ ఇటీవల విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈచిత్రం మొదటి వారంలో రూ.40కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి రెండవ వారంలోకి ఎంటర్ అయ్యింది. ఇక ఈచిత్రం అటు యూఎస్ లో కూడా రూ.5కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.

కామెడీ డ్రామా గా ప్రేక్షుకుల ముందుకు వచ్చిన ఈచిత్రంలో నాగ్, నాని ల కెమిస్ట్రీ హైలైట్ అయ్యింది. యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో రష్మిక, ఆకాంక్ష సింగ్ లు కథానాయికలుగా నటించారు. ఈచిత్రాన్ని వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించింది.

Exit mobile version