నల్లమల టీజర్ ను విడుదల చేయనున్న డైరెక్టర్ దేవకట్టా!

Published on Sep 29, 2021 4:00 pm IST

అమిత్ తీవారి, భాను శ్రీ ప్రధాన పాత్రల్లో, నాజర్, తనికెళ్ళ భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, షవర్ అలీ, ఛత్రపతి శేఖర్, కాశీ విశ్వనాథ్, చలాకి చంటి, ముక్కు అవినాష్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం నల్లమల. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతేకాక ఈ చిత్రం నుండి విడుదల అయిన ఏమున్నవే పిల్లా పాట యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్రం నుండి టీజర్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను సెప్టెంబర్ 30 వ తేదీన ఉదయం 11 గంటలకు రామానాయుడు స్టూడియో నందు ప్రముఖ దర్శకుడు దేవకట్టా విడుదల చేయనున్నారు. నల్లమల చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం రవి చరణ్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :