‘దేవకీ నందన వాసుదేవ’ : ఫస్ట్ లిరికల్ వీడియో రిలీజ్ డేట్ లాక్

ఇటీవల హీరో మూవీతో టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా, ఆ మూవీతో పర్వాలేదనిపించే విజయం అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన హీరోగా తెరకెక్కుతోన్న రెండవ సినిమా దేవకీ నందన వాసుదేవ.

ఆద్యంతం వినోదభరితమైన కథ కథనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీకి అర్జున్‌ జంధ్యాల దర్శకత్వం వహిస్తుండగా స్టార్‌ రైటర్‌ సాయిమాధవ్‌ బుర్రా మాటలు అందిస్తున్నారు. కొత్త నిర్మాత సోమినేని బాలకృష్ణ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ మూవీకి బీమ్స్‌ సిసిలోరియో సంగీతం అందిస్తుండగా ప్రశాంత్ వర్మ కథని సమకూర్చారు.

వారణాసి మానస కథానాయికగా నటిస్తున్న ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఏమయ్యిందే అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ప్రోమోకి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది. విషయం ఏమిటంటే, ఈ సాంగ్ యొక్క ఫుల్ లిరికల్ వీడియోని మే 3న రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు. కాగా దేవకీ నందన వాసుదేవ మూవీని అన్ని కార్యకమాలు ముగించి త్వరలో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

Exit mobile version