దే’వర’ 2.. ఈ 3 ఎలిమెంట్స్ తో హైలైట్!

devara-2

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కాకుండా అవైటెడ్ సీక్వెల్ లో కూడా తాను నటించాల్సి ఉంది. మరి ఆ సినిమానే దే’వర’ 2. దర్శకుడు కొరటాల శివతో చేసిన పార్ట్ 1 ఊహించని సక్సెస్ ని అందుకొని ఎన్టీఆర్ అసలు స్టామినా ఏంటో చూపించింది. దీనితో పార్ట్ 2 పట్ల కూడా మంచి బజ్ నెలకొంది.

ఇక ఈ సినిమా స్క్రిప్ట్ పనులు కూడా లాక్ చేసిన కొరటాల ఈసారి మరింత పవర్ఫుల్ గా సిద్ధం చేస్తున్నట్టు తన టీం నుంచి తెలుస్తుంది. గత పార్ట్ లో ఫియర్ ఎలిమెంట్ ని హైలైట్ చేస్తూ తీసుకొచ్చారు. కానీ ఈసారి దానితో పాటుగా పవర్, రివెంజ్ కూడా అంటున్నారు. సో మొత్తం మూడూ పార్ట్ 2 లో కనిపిస్తాయని చెప్పవచ్చు. ఫియర్, పవర్ పక్కన పెడితే రివెంజ్ పార్ట్ ఆసక్తిగా మారింది. వర రోల్ ఈ సినిమాని తీసుకెళ్తుంది. సో పార్ట్ 2 వర రివెంజ్ స్టోరీనే అనుకోవాలి. ఇక ఈ షూట్ ఎప్పుడు మొదలవుతుందో వేచి చూడాలి మరి.

Exit mobile version