మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించి ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకి సంగీతం అందించిన అనిరుద్ వర్క్ భారీ ప్లస్ అయ్యింది. దీనితో సినిమా రిలీజ్ అయ్యాక అనిరుద్ వర్క్ పై ప్రశంసలు వచ్చాయి.
మరి తన స్కోర్ తో పాటుగా తాను ఇచ్చిన నాలుగు పాటలు కూడా పెద్ద హిట్ అయ్యాయి. అయితే మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ స్పాటిఫైలో దేవర ఆల్బమ్ సంచలన రికార్డు సెట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి కేవలం నాలుగు పాటలు కలిగిన ఈ ఆల్బమ్ ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్స్ ని దాటింది. అది కూడా మన తెలుగు నుంచి ఫాస్టెస్ట్ రికార్డు ఇది అన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే దేవర మ్యూజిక్ పేరిట కూడా భారీ రికార్డులు నమోదు అయ్యాయని చెప్పాలి.