మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” (Devara Movie) కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా కొరటాల ఈ సినిమాని ఊహించని మాస్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు.
అయితే రీసెంట్ గానే సినిమా అవైటెడ్ ఫస్ట్ సింగిల్ (Devara First Single) ని అనౌన్స్ చేయగా ఇప్పుడు దీనిపై మరింత ఆసక్తి నెలకొంది. ఇక మరోపక్క ప్రస్తుతం ఆస్ట్రేలియాలో తన మ్యూజిక్ కాన్సెర్ట్ ని చేస్తున్న అనిరుద్ అక్కడ కూడా దేవర ని గట్టిగానే హైప్ ఎక్కిస్తున్నాడు. ఇలా ఇప్పుడు రానున్న దేవర మొదటి సాంగ్ ఒక పక్కా మాస్ బీట్ అన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.
దీనితో అయితే తారక్ అభిమానులకి ఒక మాస్ మ్యూజికల్ బ్లాస్ట్ రాబోతుంది అని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ తదితరులు నటిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ అక్టోబర్ 10న ఈ చిత్రం గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది.